అమరావతిలో ఎయిర్‌పోర్ట్ కోసం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం ఇరవై వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌కు రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెస్తామని రాష్ట్ర మంత్రి నారాయణ వెల్లడించారు. సేకరించిన భూమిలో ఐదు వేల ఎకరాలు ఎయిర్‌పోర్టుకు పోగా, మిగిలిన భూమిని రోడ్లు మరియు మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని స్పష్టం చేశారు.