స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని చాగంటి కోటేశ్వరరావు పిలుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: కాకినాడ
కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామం మన వారసత్వ సంపద అని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.