'కంట్రోల్ తప్పిన ఎలక్ట్రిక్ కారు': పంజాబ్‌లో వాటంతట అవే కదిలిన MG విండ్సర్ EV

రిపోర్టర్: కృష్ణ స్థలం: Punjab

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. యజమాని కారు వెలుపల ఉండగా, ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వాటంతట అదే లాక్ అయి డ్రైవర్ నియంత్రణ లేకుండా రోడ్డుపై ముందుకు కదిలింది. ఆందోళన చెందిన యజమాని కారును ఆపేందుకు పరుగులు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పండ్ల బండిని ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును బలంగా తాకి నిలిచిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.