'ఒకే రూపాయి జీతం తీసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు': మంత్రి పొంగులేటిపై పరిగి ఎమ్మెల్యే ప్రశంసలు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పనితీరును పరిగి శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి గారు ప్రశంసించారు. మంత్రి పొంగులేటి కేవలం ఒకే ఒక రూపాయి జీతం తీసుకుంటూ, ఇంతవరకు ఏ రెవెన్యూ మంత్రి చేయని విధంగా అన్ని జిల్లాలు మరియు నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజల భూ సమస్యలు, రెవెన్యూ ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంటూ రామ్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.