దండేపల్లి జూనియర్ కళాశాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండేపల్లి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా నిలిచిపోయిన నూతన కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులను త్వరగా ముగించాలని, విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.