కేంద్రీయ విద్యాలయాల హెచ్చరిక: నకిలీ మొబైల్ యాప్ల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందిని నకిలీ మొబైల్ యాప్ల పట్ల తీవ్రంగా అప్రమత్తం చేసింది. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా ప్లే స్టోర్ లో లభిస్తున్న నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని, కేవీఎస్ సమాగమ్ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా మాత్రమే సేవలు పొందాలని అధికారులు స్పష్టం చేశారు.