దీపావళి వీడియో తొలగింపు వివాదంపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందన
రిపోర్టర్: వెంకట్
స్థలం: ముంబై
నటి దియా మీర్జా దీపావళి బాణసంచా అవగాహన వీడియో తొలగింపుపై వస్తున్న విమర్శలు చిన్న విషయమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపారేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఏ కంటెంట్ ఉంచాలనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారాలు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బాణసంచా కాల్చొద్దంటూ దియా మీర్జా చేసిన విజ్ఞప్తి వీడియోను తిరిగి అప్లోడ్ చేయాలని బాంబ్డే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.