తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండల నుంచి ఉపశమనం లభించడంతో పాటు రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయనున్నాయి.