మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించిన కామాత్ముడి అరెస్టు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని లక్షెట్టిపేట గోదావరి రోడ్డులో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పెండెం సతీష్ను పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను వైద్యం కోసం తీసుకువచ్చిన తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యుడిని అదుపులోకి తీసుకున్నారు.