రణబాలి సినిమాకు సౌండ్ ట్రబుల్: థియేటర్లకు మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ఆదేశాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి సినిమాకు సంబంధించి కొన్ని థియేటర్లలో సౌండ్ లెవల్స్ సరిగ్గా లేవని ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు రావడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెంటనే స్పందించింది. ఈ మేరకు సౌండ్ స్థాయిని ఆరు లేదా ఆరున్నరకు పెంచి ప్రదర్శించాలని పంపిణీదారులకు సూచించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు వెల్లడించారు. తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.