పంటలను ఎండగడుతున్న పాలకుల నిర్లక్ష్యపు కరెంటు కోతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ కరెంటు లేక నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఏఈ గుద్దేటి రవికి వినతిపత్రం అందజేశారు.