మనోరి తీరంలో నౌకలో పేలుడు సంభవించి నలుగురు మృతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Mumbai

ముంబైలోని మనోరి తీరంలో నిలిచి ఉన్న నౌకలో రాగి పైపులను కోస్తుండగా జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారని గోరై పోలీసులు వెల్లడించారు. జూలైలో సముద్రంలో కొట్టుకుపోయిన ఏఐ జాఫ్జియా అనే నిరుపయోగ నౌకలోకి గత వారం అక్రమంగా ప్రవేశించిన ఏడుగురు వ్యక్తుల బృందం ఈ దొంగతనానికి యత్నించగా, ఇంజిన్ రూమ్లో పైపు కట్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా, వారిపై దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.