డిసెంబర్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయంపై జేపీ నడ్డా స్పందన

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకునేందుకు చేపట్టిన కార్యక్రమం విఫలమైందని, ఈ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ నేతలు విమర్శించారు. నాలుగు ప్రధాన స్థానాలకు గాను ఏబీవీపీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది.