2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలి: చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు ప్రావీణ్యం కల్పించాలని, 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏఐ వచ్చినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని, విద్యార్థుల్లో విలువలు, దేశభక్తిని పెంపొందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.