పట్టుదలతో పైలట్గా ఎదిగి విశాఖ ఖ్యాతిని చాటిన కిరణ్మయి

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి పైలట్గా ఎదిగినట్లు విశాఖకు చెందిన ఆకొండి కిరణ్మయి తెలిపారు. ఎనిమిదో తరగతిలోనే పైలట్ కావాలనే కలను పట్టుదలతో సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. నాలుగేళ్ల కఠోర శిక్షణలో భాగంగా రెండు వందల గంటల పాటు విమానం నడిపి లైసెన్స్ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రస్తుతం ఇతరులకు శిక్షకురాలిగా సేవలందిస్తున్నట్లు కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు.