చింతకానిలో పొలం ధ్వంసం చేసిన పదిహేడుమంది మహిళలపై కేసు నమోదు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చింతకాని
ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో వరి నాట్లను ధ్వంసం చేసిన ఘటనపై 17 మంది ఎస్సీ మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు కేటాయించిన భూమిలో వరి నాట్లు వేయగా, గ్రామానికి చెందిన మహిళలు వాటిని ధ్వంసం చేశారని బాధితురాలు నారపోగు వెంకట్రావమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా రూ.95 వేల నష్టం వాటిల్లిందని పేర్కొనడంతో చింతకాని ఎస్ఐ నరేశ్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.