జామి సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీ: పెండింగ్ సేవలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా జామి-2 గ్రామ సచివాలయాన్ని సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ తనిఖీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, సర్వీసెస్ డ్యాష్‌బోర్డును పరిశీలించి పెండింగ్ సేవలను సమీక్షించారు. లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలని సిబ్బందిని జేసీ హెచ్చరించారు.