రేవంత్ కుటుంబంపై యాభై వేల కోట్ల అక్రమాస్తుల దోపిడీ ఆరోపణలు: కేసీఆర్ ధ్వజం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే రేవంత్ రెడ్డి కుటుంబం ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుందని, దీనిపై ఆధారాలతో సహా మన్నె క్రిశాంక్ బట్టబయలు చేశారని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆస్తులను విదేశాలకు తరలిస్తూ మనీ ల్యాండరింగ్కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ భారీ అవినీతి ఆరోపణలపై గత మూడు రోజులుగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా మౌనంగా దాక్కున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.