నీట్ ఎస్ఎస్ అర్హత పర్సంటైల్‌ను ముప్పై శాతానికి తగ్గించిన బోర్డు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎస్ఎస్ 2025 పరీక్షా అర్హత పర్సంటైల్‌ను యాభై శాతం నుండి ముప్పై శాతానికి తగ్గిస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. తద్వారా మరికొ మంది వైద్య నిపుణులకు సూపర్‌స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం లభించనుంది.