వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోందన్న ప్రధాని మోదీ
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ, పర్యావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ అంతర్జాతీయ సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. గత 12 ఏళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని, పారిస్ వాతావరణ ఒప్పంద కట్టుబాట్లను నిర్ణీత గడువుకు ముందే సాధించామని తెలిపారు.