టీమిండియాకు భారీ షాక్: మూడో టీ20కి కూడా దూరమైన ఇషాన్ కిషన్
రిపోర్టర్: సునీల్
స్థలం: వెల్లింగ్టన్
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. తొలి టీ20లో కుడి అడక్టర్ స్ట్రెయిన్ బారిన పడిన ఇషాన్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని అధికారులు తెలిపారు. బోర్డు మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా, జట్టుతో పాటే ఉన్న కుమార్ కుషాగ్రా మూడో పోరుకు కూడా బ్యాకప్‌గా కొనసాగుతాడని వెల్లడించారు.