తెలంగాణ శాసనసభలో క్యూర్‌ బిల్లు-2024 ఏకగ్రీవ ఆమోదం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రతిష్టాత్మక ‘క్యూర్‌ బిల్లు-2024’కు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. సభ్యుల అభ్యంతరాల మేరకు ఆస్తిపన్ను పెంపును 20 శాతం నుంచి 10 శాతానికి పరిమితం చేశారు. క్యూర్‌ ప్రాంత అభివృద్ధి నిధులలో 10 శాతాన్ని పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం కోసమే కేటాయించనున్నట్లు మంత్రి డి. శ్రీధర్‌బాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు.