పొన్కల్ లో ఇంటింటికీ తిరుగుతూ చేయూత పెన్షన్లను తనిఖీ చేసిన అధికారులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామంలో చేయూత పెన్షన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని రాంనగర్, వినాయక్ నగర్, గాంధీనగర్, పాత పొన్కల్ లో అధికారులు సిబ్బంది పర్యటించి చేయూత పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ప్రతి లబ్ధిదారుల ఆధార్ కార్డును పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.