ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పట్టభద్రులు భాగస్వాములు కావాలి: చినుకని మల్లేష్ యాదవ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరు గ్రామంలో భాజపా ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాజపా ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో సమస్యల పరిష్కారం కోసం ఈ ఎన్నికలు కీలకమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో చిన్నకొండూరు గ్రామశాఖ నాయకులు కనకాచారి, సృజన్, సందీప్, రవి, వినయ్, వికాస్, శివకుమార్, సదానందరెడ్డి, మహేష్, భరత్, బాలచారితో పాటు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.