రాజకీయ సంచలనం: కడప మున్సిపల్ ఎన్నికల్ లో టీడీపీ కూటమి ఘన విజయం

రిపోర్టర్: మహేష్ స్థలం: కడప

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైఎస్సార్సీపీకి ఊహించని పరాభవం ఎదురైంది. జిల్లాలోని బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు పురపాలికలను టీడీపీ కైవసం చేసుకుంది. యర్రగుంట్ల నగర పంచాయతీని బీజేపీ దక్కించుకుంది. ఐదు స్థానాలను కూటమి కైవసం చేసుకుందని, ఈ ఫలితాలు రాయలసీమ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని నాయకులు పేర్కొన్నారు.