విరిగిపడిన వంతెన రక్షణ గోడ.. నిలిచిన రాకపోకలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా తెర్లాం మండలం పణుకువలస కూడలి సమీపంలో వంతెన రక్షణ గోడ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర పరిస్థితి కారణంగా అధికారులు భారీ వాహనాలను నిలిపివేశారు. ప్రయాణికులు కిలోమీటరున్నర దూరం కాలినడకన వెళ్లి ఆటోలు, బస్సులు ఎక్కాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.