బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌ను ఘనంగా సన్మానించిన బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌ను బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గోశాల, వేద పాఠశాల, గాయత్రీ మాత ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన స్థలం కేటాయించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు.