అమెరికా రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి: మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహబూబాబాద్
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన దారం సుప్రియ మృతి చెందడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.