ఈ నెల 25న హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగరంలోని వినాయకుల సామూహిక నిమజ్జనం ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగనుంది. భక్తుల దర్శనానికి ఈ నెల 23వ తేదీ బుధవారం రాత్రి వరకే అవకాశం కల్పించగా గురువారం నుంచి శోభాయాత్ర ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు వాహనాన్ని కదిలించి మధ్యాహ్నం 12 గంటలకల్లా నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ భావిస్తోంది.