చింతపల్లి మండలంలో బోలెరో వాహనం బోల్తా తృటిలో తప్పిన ప్రాణాపాయం

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ గ్రామం వద్ద ఎర్రగుప్పు టర్నింగ్ దగ్గర బుల్లోరా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కోరుకొండ నుంచి వంగసారకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో డ్రైవర్ మహేష్, ఓనర్ భూపతి రాజు మాత్రమే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.