నర్సీపట్నంలో అభివృద్ధి నినాదంతో వర్షంలోనూ హోరెత్తుతున్న చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నంలో మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చింతకాయల పద్మావతి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె విస్తృతంగా పర్యటిస్తుండగా స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. గతంలో చేపట్టిన కోట్ల అభివృద్ధి పనులే తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.