హనుమాన్ అంశ్ సీక్వెల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ?
రిపోర్టర్: హరి
స్థలం: India
సంచలన విజయం సాధించిన 'హనుమాన్ అంశ్' చిత్రానికి వస్తున్న సీక్వెల్లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా భక్తులుగా ఉన్న ప్రముఖుల పాత్రల కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పాటు హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్‌ను సంప్రదించినట్లు నిర్మాత నమ్రతా సింగ్ వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.