విద్యార్థుల తల్లిదండ్రుల కోసం కేంద్రీయ విద్యాలయాల కొత్త సంవాద్ యాప్

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా సంవాద్ పేరెంట్ కనెక్ట్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, పరీక్షల ఫలితాలు, అకడమిక్ పురోగతిని సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ మొబైల్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాలను ధృవీకరించుకోవాలని సూచించారు. నవంబర్ ఆరవ తేదీలోగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.