విద్యార్థి సంఘం ఎన్నికలు: ఒడిశాలో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ పోలింగ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: భువనేశ్వర్
ఒడిశా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో ఎనిమిదేళ్ల విరామం తర్వాత విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ షెడ్యూల్ను వెల్లడించారు. లింగ్డో కమిటీ సిఫారసుల ఆధారంగా అక్టోబర్ 15వ తేదీన పోలింగ్ నిర్వహించి, మరుసటి రోజు ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.