ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలుస్తానన్న దానం నాగేందర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ హైకోర్టు తనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఎన్నికల్లో కొట్లాడటానికే సిద్ధమవుతున్నానని తెలిపారు. రాజకీయపోరాటాలు తనకు కొత్త కాదని, రాబోయే ఉపఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.