సేవా సంకల్ప రక్తదాన శిబిరంలో పాల్గొన్న రాంచందర్ రావు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Nagole
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు నాగౌల్ లో నిర్వహించిన సేవా సంకల్ప రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.