యూఎస్ ఓపెన్‌లో గంజాయి వాసనతో సబలెంక తీవ్ర అసహనం

రిపోర్టర్: విజయ్ స్థలం: World

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆర్యనా సబలెంకకు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో గంజాయి వాసన రావడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'కోర్టులో ఆడుతున్నప్పుడు ఇలాంటి వాసనలు ఇబ్బందికరంగా ఉన్నాయి, దయచేసి ఇలా చేయకండి' అని అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. క్రీడా ప్రాంగణంలో నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ ఘటన క్రీడాకారుల ఏకాగ్రతను దెబ్బతీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.