ఇంటర్మీడియట్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు ముప్పై రెండు పేజీల బుక్ లెట్
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు సమాధానాలు రాయడానికి ముప్పై రెండు పేజీల బుక్లెట్ను అందించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయించింది. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీవశాస్త్రానికి సంబంధించి ఈసారి వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి నలభై పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు.