దేశవ్యాప్తంగా 3,800 మంది బాల కార్మికులను రక్షించిన ఎన్సీపీసీఆర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

దేశవ్యాప్తంగా ఎన్సీపీసీఆర్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో 3,800 మందికి పైగా చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి రక్షించారు. జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో 575 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. చిన్నారుల రక్షణ, పునరావాసం, విద్య కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అధికారులు స్పష్టం చేశారు.