కొరివి టైటిల్ తో కొత్త సినిమా ప్రకటన: హారర్ థ్రిల్లర్గా శ్రీధర్ గాదె దర్శకత్వం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
ఎస్సార్ కల్యాణమండపం ఫేమ్ దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు 'కొరివి' అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కమిటీ కుర్రోళ్లు ఫేమ్ ఈశ్వర్ రాచిరాజు హీరోగా నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు వెంకట్ తలారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు శ్రీధర్ గాదె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయగా, మాయానది ప్రాంతంలోని నిధికి కాపలా కాసే దెయ్యం కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు స్పష్టమైంది.