స్థానిక ఎన్నికల్లో వైసిపి విజయమే లక్ష్యం: బొత్స సత్యనారాయణ పిలుపు
రిపోర్టర్: B RAJESH
స్థలం: బొబ్బిలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి విజయమే లక్ష్యంగా కృషి చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మెరక ముడుదాం మండలం గర్భం గ్రామంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.