ట్రీటెడ్ వాటర్ వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

రాష్ట్రంలో శుద్ధి చేసిన మురుగునీటి వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ట్రీటెడ్ వాటర్ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ప్లాంట్ల నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతను వాడాలని, తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.