గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన చిన్న శ్రీను

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ప్రత్యేకంగా కలుసుకున్నారు. కూతురు సిరి సహస్రతో కలిసి గోవాలోని గవర్నర్ అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతో పాటు సీనియర్ నేతల మార్గనిర్దేశాన్ని పాటిస్తానని చిన్న శ్రీను స్పష్టం చేశారు.