డిజిటల్ చెల్లింపుల్ లో సరికొత్త రికార్డు: భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ మరో మైలురాయిని అధిగమించిందని నిపుణులు తెలిపారు. అక్టోబర్ నెలలో పండుగ సీజన్ కారణంగా వినియోగదారుల ఖర్చులు భారీగా పెరగడంతో లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ స్థాయిలో వృద్ధి చెందుతున్న తరుణంలో కొన్ని రకాల యూపీఐ పేమెంట్స్ పై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు.