బయ్యారం పెద్ద చెరువు వద్ద పోలీసుల పహారాపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు తూముల వద్ద పోలీసులు కాపలా కాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు పొలాలకు నీళ్లు పారించుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని, తెలంగాణలో ఎవరి పాలన సాగుతోందంటూ బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. చెరువుల పరిరక్షణ పేరుతో అన్నదాతలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.