ఢిల్లీలో సీజేపీ నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరణ: నగరంలో హైఅలర్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: ఢిల్లీ
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ తలపెట్టిన నిరసన ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు అధికారులు వెల్లడించారు. నిరసనకు వెనుకాడబోమని నిర్వాహకులు స్పష్టం చేయడంతో రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. నగరవ్యాప్తంగా నిఘా పెంచడంతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మరియు సుమారు యాభై ఏడు మెట్రో స్టేషన్లను రాత్రి నుంచి మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు.