అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా ఉందన్న రింకూ సింగ్

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

భారత డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న సింగిల్ ఫార్మాట్ ప్లేయర్ ముద్రను తోసిపుచ్చుతూ, అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా తనకు ఉందని తెలిపారు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో రాణిస్తున్న తాను, త్వరలోనే వైట్ జెర్సీ ధరించి టెస్ట్ క్రికెట్ ఆడతాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న రింకూ సింగ్, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షించారు.