జగన్, విజయసాయిలు క్రైమ్ పార్ట్నర్స్: మంత్రి సత్యకుమార్ ఫైర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుపతి
వైసీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలను మంత్రి సత్యకుమార్ 'క్రైమ్ పార్ట్నర్స్'గా అభివర్ణించారు. అక్రమార్జన కేసుల్లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయి ఉన్నారని గుర్తుచేశారు. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో చేసిన అక్రమాలపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని తిరుపతి వేదికగా ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో కల్తీ మద్యం తాగి 30 వేల మంది పేదలు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.