రూ.22,154 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 21వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ.22,154.58 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ల ద్వారా 19,739 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. రాష్ట్రాన్ని హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని, సెమీకండక్టర్లు, రోబోటిక్స్ వంటి అధునిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎగుమతుల్లో తిరుపతి జిల్లా దేశంలోనే పదవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.