తులాభారం సినిమా: రెగ్యులర్ షూటింగ్లో పాల్గొన్న హీరో రవితేజ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ యాక్షన్ కామెడీ చిత్రం తులాభారం రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. రవితేజ కెరీర్లో ఇదొక వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని, తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.